- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రీసెంట్‌గా వచ్చిన సినిమాలా ‘స్వయంభు’లో ఏఐ వాడలేదు.. చర్చనీయాంశంగా మారిన నిఖిల్ పోస్ట్
మా ‘స్వయంభు’లో ఎలాంటి ఏఐని వినియోగించలేదు.

దిశ, సినిమా: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth)నటిస్తున్న భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’ (Swayambhu)టీజర్ విడుదల వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. భరత్ కృష్ణమాచారి (Bharat Krishnamachari)దర్శకత్వంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఇటీవల విడుదలైన టీజర్ క్వాలిటీ విషయంలో యూట్యూబ్ సాంకేతిక లోపాల వల్ల విజువల్స్ సరిగ్గా కనిపించలేదు. దీంతో నిఖిల్, వెంటనే ఆ టీజర్‌ను తొలగించారు. తాజాగా, మళ్ళీ సినిమాస్కోప్ వ్యూ, హై-క్వాలిటీ HDR వెర్షన్‌లో టీజర్‌ను రీ-అప్‌లోడ్ చేసి ప్రేక్షకులకు సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించారు. ఈ టీజర్‌ను రీ-అప్‌లోడ్ చేసే క్రమంలో నిఖిల్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. "యూట్యూబ్ గ్లిట్జ్‌ల వల్ల టీజర్‌ను మళ్లీ అప్‌లోడ్ చేయాల్సి వచ్చింది. ఇటీవల వచ్చిన చిత్రంలో లాగా మా ‘స్వయంభు’లో ఎలాంటి ఏఐని వినియోగించలేదు.
అన్నీ నేచురల్‌గా చిత్రీకరించాం’’ అని ఆయన అనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇటీవల విడుదలైన ఒక భారీ బడ్జెట్ సినిమాలో విజువల్స్ కోసం ఏఐ వాడారనే విమర్శలు వినిపిస్తున్న సమయంలో, నిఖిల్ కావాలనే ఆ సినిమాను ఉద్దేశించి ఈ కామెంట్ చేశారంటూ నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. నిఖిల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక స్వయంభు విషయానికొస్తే.. ప్రస్తుతం షూటింగ్ ముగింపు దశలో ఉన్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్, నభా నటేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సాంకేతికత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, అత్యున్నత నాణ్యతతో ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.






