‘మార్క్ ఆంటోనీ’‌లో ఏఐ జనరేటెడ్ సిల్క్‌ స్మిత యాక్టింగ్.. ఆడియన్స్ ఫీలింగ్ ఏంటంటే..

by Disha Web Desk 6 |
‘మార్క్ ఆంటోనీ’‌లో ఏఐ జనరేటెడ్ సిల్క్‌ స్మిత యాక్టింగ్.. ఆడియన్స్ ఫీలింగ్ ఏంటంటే..
X

దిశ, సినిమా: విశాల్, ఎస్‌.జె. సూర్య కలిసి నటించిన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో శుక్రవారం (సెప్టెంబర్ 15) థియేటర్స్‌లో విడుదలైంది. ఇక పబ్లిక్ టాక్ చూస్తే గనుక విశాల్ ఇందులో హీరో అయినప్పటికీ, సూర్య ఒంటిచేత్తో ఈ సినిమాని నడిపించారని అంటున్నారు. అంతేగాక ఫస్ట్ ఆఫ్ బాగుందని, సెకండ్ ఆఫ్ అంతకుమించి అన్నట్లుగా ఉందని, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ మూవీకి చాలా ప్లస్ అని టాక్.

ఇక ఇందులో యాక్టర్స్ సిల్క్ స్మిత‌ను చూసిన ఆడియన్స్ షాక్ అవుతున్నారు. అచ్చం స్మిత‌లా కనిపిస్తున్న ఈ అమ్మాయి తమిళ్ యాక్టర్ విష్ణు ప్రియా గాంధి. సినిమాలో ఆమెను చూసి నిజంగానే సిల్క్ స్మిత యాక్ట్ చేసినట్లు ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. అంతేగాక ఆమె క్యారెక్టర్ రావడానికి ఏఐ టెక్నాలజీ హెల్ప్ తీసుకున్నారా? అనే డౌట్ క్రియేట్ చేశారు మేకర్స్. మొత్తంగా ఈ మూవీ హిట్‌కు ఒకింత విష్ణు ప్రియ కూడా కారణమని చెప్పాలి.



Next Story

Most Viewed