మా ఇద్దరినీ ఇండస్ట్రీ నుంచి తరిమేసే కుట్ర జరుగుతోంది: వివేక్ అగ్నిహోత్రి

by Disha Web Desk 17 |
మా ఇద్దరినీ ఇండస్ట్రీ నుంచి తరిమేసే కుట్ర జరుగుతోంది: వివేక్ అగ్నిహోత్రి
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఇండస్ట్రీపై స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు. కొంతకాలంగా పరిశ్రమలో చర్చనీయాంశమైన నెపోటిజం ఇష్యూను ఉద్దేశిస్తూ సంచలన ఆరోపణలు చేశాడు. తనను కావాలనే బీటౌన్ దూరం పెడుతుందన్నాడు. ‘నాపై ఎంతమంది వివక్ష చూపించినా.. ప్రేక్షకులు మాత్రం మద్దతుగా నిలుస్తున్నారు. నన్ను ఆదరిస్తున్నారు. హిందీ సినిమాలు రియాలిటీకి దూరంగా ఉంటున్నాయి. కరణ్ జోహర్ మూవీ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’లో చూపించినట్లే యువకులు ఉండరు. అందుకే ఫెయిల్ అవుతున్నాయి. ఈ కారణంతోనే ‘బాలీవుడ్ బాయ్‌కాట్’ నినాదం పుట్టుకొచ్చింది. పరిశ్రమలో జరిగే తప్పుల గురించి నేనూ, కంగనా రనౌత్ మాత్రమే ప్రశ్నిస్తున్నాం. అందుకే మా ఇద్దరిని టార్గెట్ చేసి ఇండస్ట్రీకి దూరం చేయాలని చూస్తున్నారు. ఏదీ ఏమైనా మాకు ప్రశ్నించే హక్కు ఉంది’ అంటూ తన అభిప్రాయం వెల్లడించాడు.




Advertisement
Next Story

Most Viewed