మరికొన్ని గంటల్లో వైల్డ్ సాలా ఎంట్రీ

by Disha Web Desk 7 |
మరికొన్ని గంటల్లో వైల్డ్ సాలా ఎంట్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా.. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమాస్ పతాకాలపై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ ఎత్తున నిర్మించిన పాన్ ఇండియన్ మూవీ ఏజెంట్. మమ్ముట్టి, డినో మోరియో ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ‘ఏజెంట్’ పై భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్నాయి. విడుదల సమయం దగ్గర పడటంతో మూవీకి సంబంధించి యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తోంది.

రేపు అంటే ఏప్రిల్ 28న ఏజెంట్ పలు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ముఖ్యమైన ఏరియాల్లో ఏజెంట్ సినిమా ఎర్లీ మార్నింగ్ షోలు ప్రదర్శింపబడుతున్నాయి. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన మా ఏజెంట్ సినిమా మరికొద్ది గంటల్లో విడుదల కానుండగా, మూవీ భారీ విజయం సాధిస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వైల్డ్ సాలా పాత్రలో అఖిల్ రా ఏజెంట్ గా అద్భుతంగా నటించాడని, ఈ సినిమా అతనికి కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ ఇస్తుందని కూడా అభిప్రాయపడుతున్నారు.

Next Story

Most Viewed