Agent Movie: అఖిల్ కోసం ఆర్ఆర్ఆర్ హీరోస్ ఏమి చేయనున్నారు?

by Disha Web Desk 10 |
Agent Movie: అఖిల్ కోసం ఆర్ఆర్ఆర్ హీరోస్ ఏమి చేయనున్నారు?
X

దిశ, వెబ్ డెస్క్ : బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ను అమాంతం పెంచేసిన రాజమౌళి, ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ని గ్లోబల్ స్టార్స్ చేసాడు. ఇక మహేష్ బాబుకు అయితే హాలీవుడ్ క్రేజ్ను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అందుకోవడంతో తారక్, చెర్రీ హవా నడుస్తుంది. ఇలాంటి స్టార్స్ తో కొత్త సినిమా ప్రమోషన్స్ చేస్తే ఒక రేంజుకు వెళ్లడం ఖాయం. అక్కినేని అఖిల్ ఈ ఇద్దరు హీరోలను రంగంలోకి దింపేందుకు రెడీ అవుతున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ఏజెంట్. ఏప్రిల్ 28 న ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. ఇప్పటి వరకు అఖిల్‌కు సరయిన మాస్ బొమ్మ పడలేదు. ఈ సినిమాతో మాస్ ఫాలోయింగ్‌తో పాటు పాన్ ఇండియా స్టార్ డమ్ కొట్టేయాలని చూస్తున్నారు. ఏజెంట్ కోసం వీరిద్దరిని కాకా పట్టినట్టు తెలుస్తుంది.

Also Read..

Mega Heroes: కోలీవుడ్ వైపు చూస్తున్న మెగా ఫ్యామిలీ? ఎందుకో తెలుసా?

నాగచైతన్య రెండో పెళ్లిని అడ్డుకుంటుంది ఎవరో తెలుసా?



Next Story