ఏజెంట్ మూవీ.. అఖిల్ ఖాతాలో హిట్ట్ పడనట్లేనా?

by Dishanational2 |
ఏజెంట్ మూవీ.. అఖిల్ ఖాతాలో హిట్ట్ పడనట్లేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : భారీ అంచనాల మధ్య అఖిల్ ఏజెంట్ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, రూపొందిన ఈ చిత్రం దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు.ఇక ఈ చిత్రంతో అఖిల్ స్టార్ హీరో అవుతాడని తన అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ మూవీ ఎలా ఉండబోతుందో, అఖిల్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడబోతుందో లేదో చూద్దాం.

ఈ సినిమాలో కథ నాసిరకంగా ఉందంట. మూవీలో అఖిల్‌ను కేవలం డ్యాన్స్‌లకు ,ఫైట్స్‌కి మాత్రమే పరిమితం చేశారనిపిస్తుందంట.అంతే కాకుండా హీరోయిన్ పాత్రకు కూడా ప్రాధాన్యత లేదంట. మూవీలో పాటలు కూడా ఆకట్టుకునేలా లేవు. ఈ కథకు సరైన స్క్రీన్‌ప్లే సమకూర్చుకోవడంలో వినాయక్‌ సక్సెస్‌ అవ్వలేకపోయాడు. జువా అనే ఒక కొత్త పాయింట్‌ని సెలెక్ట్‌ చేసుకొని దానికి ఒక నాసిరకం ప్రేమకథను జోడించి, దాన్ని రకరకాల మలుపులు తిప్పి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించడంలో మాత్రం వినాయక్‌ సక్సెస్‌ అయ్యాడంటున్నారు కొందరు.అలాగే ఈ సినిమా ద్వారా అఖిల్ హిట్ అందుకున్నా, స్టార్ హీరో మాత్రం కాలేడు అంటూ కొందరు ముచ్చటిస్తున్నారు.

Also Read..

‘ఏజెంట్’ అఖిల్ కెరీర్‌ను మార్చేస్తుంది: నిర్మాత

Next Story