Agent Movie: 'ఏజెంట్' సినిమా మీద అఖిల్‌కు నమ్మకం లేదా?

by Disha Web Desk 10 |
Agent Movie: ఏజెంట్ సినిమా మీద అఖిల్‌కు నమ్మకం లేదా?
X

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన సినిమా 'ఏజెంట్'. ఈ సినిమా ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంటును వరంగల్లో నిర్వహించారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వారందరూ సినిమా పైన నమ్మకం లేనట్టుగా మాట్లాడారు. ముందుగా అఖిల్ మైక్ తీసుకొని 'మేము కలిసినప్పుడు ఎదో ఒక ప్రాజెక్ట్ క్రేజీగా చెయ్యాలని అనుకున్నాము. కానీ ఎదో చేసాము అంతే సార్ ' అంటూ అఖిల్ మాట్లాడిన మాటలను నెటిజెన్స్ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టేసారు. ఆ తర్వాత డైరెక్టర్ కూడా 'నీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాను..ఈ సినిమా నీకోసమే తీసా' అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా హీరో, డైరెక్టర్ మాటలను బట్టి చూస్తే సినిమా అవుట్ ఫుట్ రాలేదా అనే అనే సందేహాలు వస్తున్నాయి.

Read more:

అఖిల్ అమలను చాలా వేధించాడు డాక్టర్‌కు చూపించింది.. నాగార్జున కామెంట్స్ వైరల్..!

Next Story

Most Viewed