‘ఏజెంట్’ వేరీ వైల్డ్.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది: అఖిల్

by Disha Web Desk 7 |
‘ఏజెంట్’ వేరీ వైల్డ్.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది: అఖిల్
X

దిశ, సినిమా: ఏప్రిల్ 28న విడుదల కాబోతున్న ‘ఏజెంట్’ మూవీ గురించి అఖిల్ అక్కినేని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘నాకు లార్జర్ దేన్ లైఫ్, యాక్షన్ సినిమాలు అంటే చాలా ఇష్టం. రాజమౌళిగారి సినిమాలంటే పిచ్చి. ఏదైనా కొత్తగా, ఫ్రెష్‌గా చేయాలనుకుంటా. ఈ క్రమంలోనే సురేందర్‌గారితో ‘ఏజెంట్’ జర్నీ మొదలైంది. ఒక సినిమాకు రెండేళ్లు పట్టినా.. చాలా హార్డ్ వర్క్ చేసి ప్రేక్షులకు గొప్ప అనుభూతి ఇవ్వాలని కోరుకుంటా. బాడీ బిల్డింగ్‌లో హృతిక్ రోషన్‌ను చూసి రియలైజ్ అయ్యాను. ఈ మూవీలో ప్రతి క్షణం హైలో మాట్లాడటం చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే వ్యక్తిగతంగా నేను కొంచెం సిగ్గరి. ఇది కంప్లీట్ న్యూ సెటప్. ఖచ్చితంగా ‘ఏజెంట్’ ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. ‘ఏజెంట్’.. వెరీ వైల్డ్’ అంటూ చెప్పుకొచ్చాడు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర చిత్రాన్ని నిర్మించారు.

Also Read....

'ఏజెంట్' సెన్సార్ పూర్తి

Next Story

Most Viewed