‘ఏజెంట్’ రోలర్ కోస్టర్ రైడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది: డినో మోరియా

by Disha Web Desk 9 |
‘ఏజెంట్’ రోలర్ కోస్టర్ రైడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది: డినో మోరియా
X

దిశ, సినిమా: ‘ఏజెంట్’ మూవీ ప్రేక్షకులకు రోలర్ కోస్టర్ రైడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందంటోంది డినో మోరియా. ఇందులో అఖిల్ సరసన నటించిన ఆయన.. ప్రత్యేక ఇంటర్వ్యూలో సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశాడు. ‘కథ వినగానే తెలుగులోకి రావడానికి ఇదే బెస్ట్ స్క్రిప్ట్ అనిపించింది. నా పాత్ర పేరు గాడ్. దర్శకుడు సురేందర్ రెడ్డి అద్భుతంగా డిజైన్ చేశారు.

ఎమోషన్, డ్రామాతో కూడిన క్యారెక్టర్ అందరినీ అలరిస్తుంది. ‘ఏజెంట్’ గేమ్ డిఫరెంట్ అండ్ టెర్రిఫిక్. మమ్ముట్టితో పని చేయడం గొప్ప అనుభూతినిచ్చింది. ఈ సినిమాలో ప్రతిది లౌడ్ లార్జ్ ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ లుక్స్, సాంగ్స్‌కు ట్రెమండస్ రెస్పాన్స్‌ రావడం.. చిత్రంపై భారీ అంచనాలు పెరిగినందుకు హ్యాపీగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న మూవీ ఏప్రిల్ 28న విడుదల కానుంది.

Also Read..

బలవంతంగా నా ఇంటి పేరు మార్చేశారు.. అఖిల్ షాకింగ్ కామెంట్స్



Next Story

Most Viewed