- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ ఇలా అయిపోయాడేంటి..?
తెలుగులో మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్Latest Telugu News

X
దిశ, సినిమా: తెలుగులో మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే హీరో లుక్స్ గురించి ఆందోళన చెందుతున్నారు ఫ్యాన్స్. బాహుబలి 2 వరకు ఆయన లుక్ పర్ఫెక్ట్‌గా ఉండగా రెండేళ్ల గ్యాప్‌తో వచ్చిన సాహో సినిమాలో చాలా చేంజెస్ కనిపించాయి. ఒకప్పటి ఆ గ్లామర్ ఏమైంది అన్నట్టు తయారయ్యాడు. తాజాగా హీరో అల్లు అర్జున్‌తో కలిసి ఫోటోలకు పోజులిచ్చాడు ప్రభాస్. ఈ ఫొటోలో ప్రభాస్ లుక్ అసలేం బాగాలేదు. ఆయన బరువు పెరిగి షేప్ అవుట్ అయ్యారు అనిపిస్తుంది. చాలా గ్యాప్ తర్వాత రెబల్ స్టార్‌ను ఈ లుక్‌లో చూసిన ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ప్రభాస్ ఆరోగ్యం, ఫిట్నెస్‌పై కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నారు.
Next Story






