చాలా గ్యాప్ తర్వాత పవన్ చిత్రం‌లో నటించనున్న ఆలీ

by Chukka Sudharani |   (  Updated:2023-06-24 06:08:42  IST  )

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘OG’ ఒకటి.

చాలా గ్యాప్ తర్వాత పవన్ చిత్రం‌లో నటించనున్న ఆలీ
X

దిశ, సినిమా: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘OG’ ఒకటి. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్‌లో పవన్‌ లేని పోర్షన్‌లు షూట్ చేస్తున్నారు. అయితే ఇందులో నటీనటుల విషయంపై మాత్రం మూవీ టీం సస్పెన్స్‌లో పెడుతోంది. కాగా ప్రజెంట్ ఇంట్రెస్టింగ్ గాసిప్ అయితే వినపడుతోంది.

అదేంటంటే.. ‘నటుడు ఆలీ నా పక్కన ఉంటే నాకు తెలియని ఒక ధైర్యం. మూవీస్‌లో మంచి కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది’ అని గతంలో పవన్ చాలా సందర్భాల్లో అన్నారు. అంతేగాక వీరిద్దరూ నటించిన చిత్రాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా ‘ఓజీ’లో కూడా అలీ నటించనున్నట్లు తెలుస్తోంది. కానీ ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Click here for more Cinema news

Next Story