- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'పఠాన్' కోసం ఎగబడుతున్న జనం.. రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్!
నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న సినిమా 'పఠాన్'. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.

X
దిశ, సినిమా: నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న సినిమా 'పఠాన్'. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ బుధవారం (జనవరి 18)ప్రారంభం కాగా.. అప్పుడే రికార్డు స్థాయిలో బుక్ అయ్యాయి. హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో వీటిని ప్రారంభించారు.
అయితే కాసేపటికే టికెట్స్ బుకింగ్ యాప్ అయిన 'బుక్ మై షో యాప్'లో అభిమానులు టికెట్ బుకింగ్‌లు ఒక్కసారిగా చేయడంతో యాప్ స్ట్రక్ అయిపోయింది. ఆ రేంజ్‌లో బుకింగ్ కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. కేవలం 5 గంటల్లో రూ.కోటి విలువైన టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. ఈ మూవీకి పూర్తిస్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ శుక్రవారం (జనవరి 20) నుంచి ప్రారంభంకానున్నాయి. బుధవారం 2డీ, 2డీ మ్యాక్స్, 4డీ ఎక్స్ స్క్రీన్ల కోసం బుకింగ్ ప్రారంభించారు.
READ MORE
Next Story






