- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడివి శేష్ ‘డెకాయిట్’ ధమాకా.. బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నామంటూ పోస్ట్!
నేను మొదటిసారి డ్యాన్స్ చేశాను.. ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను.

దిశ, సినిమా: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘డెకాయిట్’. క్రేజీ డైరెక్టర్ షానీల్ డియో తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్‌డేట్‌ను అడివి శేష్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఎప్పుడూ సీరియస్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేటివ్ సినిమాలతో మెప్పించే అడివి శేష్, ఈసారి అభిమానులకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ‘డెకాయిట్’ సినిమాలోని తదుపరి సాంగ్ త్వరలోనే విడుదల కాబోతోందని చెబుతూ.. ఈ పాటలో తను మొదటిసారి డ్యాన్స్ చేశానని వెల్లడించారు. "నేను మొదటిసారి డ్యాన్స్ చేశాను.. ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను" అంటూ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ చేశారు.
శేష్ డాన్స్ అనగానే ఫ్యాన్స్ ఇప్పుడే ఖుషీ అయిపోతున్నారు. అంతేకాదు, ఈ పాటలో కొంతమంది ప్రత్యేక అతిథులు కూడా కనిపించబోతున్నారని శేష్ హింట్ ఇచ్చారు. ఆ గెస్ట్స్ టాలీవుడ్ స్టార్లా లేక బాలీవుడ్ ప్రముఖులా అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఈ చిత్రంలో బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సుప్రియ యార్లగడ్డ మరియు సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా, అటు అడివి శేష్‌కు ఇటు మృణాల్‌కు కెరీర్‌లో చాలా స్పెషల్ మూవీగా నిలవబోతోంది. ఏప్రిల్ 10న థియేటర్స్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది.






