- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుష్కను కాలితో తన్నిన అడివిశేష్.. షాకింగ్ విషయాలు చెప్పడంతో నెటిజన్ల రియాక్షన్ ఇదే!
సీన్ పర్ఫెక్ట్‌గా రావడం కోసం ఫోర్స్‌ఫుల్‌గా తన్నమని సూచించారు. దాంతో నేను నిజంగానే అనుష్క గారిని బలంగా తన్నాను

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ ‘డెకాయిట్’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. షానిల్ డియో దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శేష్, తన కెరీర్ మొదట్లో ‘బాహుబలి’ సినిమాలో నటించినప్పటి ఒక షాకింగ్ సంఘటనను గుర్తు చేసుకున్నారు.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విజువల్ వండర్ ‘బాహుబలి’లో అడివి శేష్, భల్లాళదేవుడి (రానా) కొడుకు భద్ర పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఒక కీలక సన్నివేశంలో బందీగా ఉన్న అనుష్కను (దేవసేన) శేష్ తన్నాల్సి ఉంటుంది. ఈ సీన్ గురించి శేష్ మాట్లాడుతూ.. "షూటింగ్ సమయంలో ఆ సీన్‌లో కావాల్సినంత ఇంటెన్సిటీ రావడం లేదని రాజమౌళి గారు చెప్పారు.
సీన్ పర్ఫెక్ట్‌గా రావడం కోసం ఫోర్స్‌ఫుల్‌గా తన్నమని సూచించారు. దాంతో నేను నిజంగానే అనుష్క గారిని బలంగా తన్నాను" అని వెల్లడించారు. అంత బలంగా తన్నడంతో అనుష్క గారి మెడ భాగం బెణికినట్లు అనిపించిందని, తాను చాలా కంగారు పడ్డానని శేష్ చెప్పారు. అయితే అనుష్క గారు మాత్రం తన నొప్పిని అస్సలు పట్టించుకోలేదని, వెంటనే లేచి "సీన్ బాగా వచ్చిందా లేదా?" అని మాత్రమే అడిగారని గుర్తు చేసుకున్నారు. అంత డెడికేషన్ ఉన్న నటి కాబట్టే ఆమెను అందరూ 'స్వీటీ' అని పిలుస్తారని, ఆమె వ్యక్తిత్వం చాలా గొప్పదని శేష్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దేవసేనపై అడివి శేష్ చేసిన ఈ వ్యాఖ్యలు విన్న నెటిజన్లు, అనుష్క డెడికేషన్‌కు ఫిదా అవుతున్నారు.






