అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన అడివి శేష్.. ఆ సినిమా నుంచి సర్‌ప్రైజ్ రాబోతుందంటూ ట్వీట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్(Adivi Sesh) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గూఢచారి-2’(Goodachari-2).

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన అడివి శేష్.. ఆ సినిమా నుంచి సర్‌ప్రైజ్ రాబోతుందంటూ ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్(Adivi Sesh) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గూఢచారి-2’(Goodachari-2). ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ‘గూఢచారి’కి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అడివి శేష్ హీరో కాగా.. ఇమ్రాన్ హష్మి, మధు శాలిని, వామికా గబ్బి(Wamika Gabbi), సుప్రియ యార్లగడ్డ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? అని సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, అడివి శేష్ అభిమానులకు గుడ్ న్యూస్ ప్రకటించాడు.

‘గూఢచారి-2’ నుంచి ఆగస్టు 4న బిగ్ సర్‌ప్రైజ్ రాబోతున్నట్లు తెలుపులూ ఓ పోస్ట్ పెట్టారు. ‘‘క్షణం మూవీతో నన్ను నమ్మారు. కానీ ‘గూఢచారి’ చిత్రంతో ప్రేమించారు. నన్ను నటుడిగా తీర్చిదిద్దిన సినిమా విడుదలై 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ‘గూఢచారి-2’ నుంచి బిగ్ సర్‌ప్రైజ్ రాబోతుంది’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లలో ఫస్ట్ లుక్ వస్తుందా? లేక గ్లింప్స్ విడుదల చేస్తారా అనే క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న అడివి శేష్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.

link

Next Story