- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
goodachari 2: G2 నుంచి థ్రిల్లింగ్ అప్‌డేట్.. ఆరు స్టన్నింగ్ మూమెంట్స్‌ని రివిల్ చేసిన అడివి శేష్
దిశ, సినిమా: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా వచ్చిన ‘గూఢచారి’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 20218లో రిలీజైన ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దాదాపు ఆరేళ్ల తర్వాత గూఢచారికి సీక్వెల్‌గా ‘G2’ తీస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంతో వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ మేరకు తాజాగా ట్విట్టర్‌లో థ్రిల్లింగ్ అనౌన్స్ మెంట్స్ చేశారు. స్టన్నింగ్ మూమెంట్స్‌తో ఫ్యాన్స్‌ని థ్రిల్ చేశారు. ఇప్పటికే 40% షూటింగ్ పూర్తి కావడంతో, మేకర్స్ సినిమాని ఇంటర్నేషనల్ స్కేల్‌లో ప్రజెంట్ చేస్తూ ఆరు స్టైలిష్ యాక్షన్ మూమెంట్‌లను రిలీజ్ చేశారు.
G2లోని ఈ మూమెంట్స్ ఇండియాలోనే కాకుండా గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రత్యేకంగా నిలిచే స్పై థ్రిల్లర్‌ను ప్రజెంట్ చేస్తున్నాయి. 2025 సెకండ్ హాఫ్‌లో ‘G2’ గ్రాండ్‌గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇది వైడ్ రేంజ్‌లో ప్రేక్షకులకు రీచ్ అవుతోంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్ పీరియన్స్‌ని అందించబోతోంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శేష్ మాట్లాడుతూ.. "గూఢచారి సినిమా చాలా ప్రత్యేకమైనది. గత 6 సంవత్సరాలుగా ఈ సినిమా గురించి ప్రశంసలు వింటూనే ఉన్నాను. G2 బిగ్గర్ అండ్ ఇంటర్ నేషనల్ స్కేల్‌లో ఉంటుంది. గూఢచారి అభిమానులందరికీ G2 ఒక మ్యాసీవ్ విజువల్ ట్రీట్ అవుతుంది' అన్నారు.