Aditi Rao Hydari: సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన అదితి.. అతడితో రొమాన్స్‌కు రెడీ.. నీ పక్కన తండ్రిలా ఉన్నాడంటున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-05 10:04:12  IST  )

అదితి రావు హైదరీ (Aditi Rao Hydari)ముందుగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

Aditi Rao Hydari: సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన అదితి.. అతడితో రొమాన్స్‌కు రెడీ.. నీ పక్కన తండ్రిలా ఉన్నాడంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: అదితి రావు హైదరీ (Aditi Rao Hydari)ముందుగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. అక్కడ పలు సినిమాల్లో కీలక పాత్రలో నటించిన ఈ భామ ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. హీరోయిన్‌గానూ స్టార్ హీరోల సరసన నటించిం అనతి కాలంలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక తెలుగులో ‘సమ్మోహనం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె అనుకున్నంత పాపులారిటీ రాబట్టుకోలేకపోయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక గత రెండేళ్ల నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అదితి రావు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్లు సమాచారం. తాజాగా, అదితి రావు, పంకజ్ త్రిపాఠి(Pankaj Tripathi) కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ‘పరివారిక్ మనురంజన్’(Parivarik Manuranjan) పేరుతో రాబోతున్న ఈ చిత్రానికి వరుణ్ వి శర్మ దర్శకత్వం వహిస్తుండగా.. దీనిని వినోద్ భానుశాలి, హిమాన్షు మెహ్రా, అలీ అబ్బాస్ జాఫర్ నిర్మిస్తున్నారు.

అయితే నేడు ఈ మూవీకి సంబందించిన షూటింగ్ లక్నోలో ప్రారంభమైంది. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ.. అదితిరావు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నేను ఈ సినిమా స్క్రిప్ట్ చదివినప్పుడు నవ్వుకున్నాను. ఈ విశ్వంలో ఇలాంటి కథను చూడటం చాలా అరుదు. సిట్యుయేషనల్ కామెడీ, ఊహించని మలుపులు ఇందులో చూడబోతున్నారు. ముఖ్యంగా కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. పంకజ్ సర్‌తో కలిసి పనిచేయడం ఒక ట్రీట్ అవుతుంది. అతను నాకు మాస్టర్. నాకు ఇది ఒక పెద్ద అభ్యాస అనుభవం. చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చింది. అయితే అదితితో షూటింగ్ చేస్తున్న ఫొటోలను పంకజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడంతో అవి చూసిన నెటిజన్లు తండ్రిలా ఉన్నాడని అంటున్నారు.

Next Story