ఓవర్సీస్‌లో విడుదలకు సోలోగానే 'ఆదిపురుష్'

by Disha Web Desk 1 |
ఓవర్సీస్‌లో విడుదలకు సోలోగానే ఆదిపురుష్
X

దిశ, వెబ్ న్యూస్: బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో గ్లోబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్'. చాలా కాలం క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లలో సొంతంగా విడుదల కానుందని సమాచారం. ఈ పౌరాణిక యాక్షన్ ఎపిక్ సినిమాని ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీతో కలిసి సొంతంగా సినిమాను విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పెద్ద బడ్జెట్ మైథలాజికల్ మూవీలో ప్రభాస్ సరసన కృతిసనన్ నటిస్తుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్తా నాగే కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 16 జూన్ 2023న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది. T-సిరీస్ అండ్ రెట్రోఫిల్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు అజయ్-అతుల్ బాణీలు అందించారు.

Also Read..

సూపర్ స్టార్ రజినీకాంత్ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్.. డెరెక్టర్ ఖరారు!

Darling Movie: ప్రభాస్ డార్లింగ్ సినిమాకు 13 ఏళ్లు

Next Story

Most Viewed