‘Adipurush ’ దిమ్మతిరిగే కలెక్షన్స్.. మేకర్స్ అఫీషియల్ ట్వీట్

by Disha Web Desk 4 |
‘Adipurush ’ దిమ్మతిరిగే కలెక్షన్స్.. మేకర్స్ అఫీషియల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో దర్శకుడు ఓం రౌత్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆదిపురుష్‌‌’ యావరేజ్ టాక్ తోనే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొదటి రోజు వందకోట్లు వసూలు చేయడమే స్టార్ హీరోలకి బిగ్ డ్రీమ్ అయిన వేళ ప్రభాస్ మూడో రోజు కూడా ఏకంగా వంద కోట్లు కొల్లగొట్టి భారతదేశ సినీ పరిశ్రమను షాక్‌కు గురి చేస్తున్నాడు. మొదటి రోజు 140 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా వరుసగా రెండు రోజులు వంద కోట్లు వసూలు చేసింది.

అయితే ఆదిపురుష్ కలెక్షన్స్‌ని ప్రొడ్యూసర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన టీ సిరీస్ వరల్డ్ వైడ్ త్రీ డే బాక్స్ ఆఫీస్ గ్రాస్ 340 కోట్లు అని పేర్కొంది. జనరేషన్స్‌కు సంబంధం లేకుండా ‘ఆదిపురుష్’ సినిమాను ఆడియన్స్‌ను మెప్పిస్తోందని ట్వీట్‌లో తెలిపింది. ‘ఆదిపురుష్’ సినిమా కలెక్షన్లతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ఇక ‘సలార్’ సినిమాతో వీకెండ్(మూడు రోజుల్లో) లో రూ.500 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని సంబరపడుతున్నారు.

Also Read..

ఆదిపురుష్ ఎఫెక్ట్.. అక్కడ భారతీయ సినిమాలపై నిషేధం!



Next Story