కొత్త మూవీ ప్రకటించిన అదా శర్మ.. కావాలనే చేశాం కేసులు వేసుకుంటే వేసుకోండి అంటూ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-13 13:23:36  IST  )

ఒకవేళ మన లోకంలో ఎవరైనా దీనివల్ల బాధపడితే.. అది కావాలని చేసినదే అని తెలుసుకుని సర్దుకుపోండి.

కొత్త మూవీ ప్రకటించిన అదా శర్మ.. కావాలనే చేశాం కేసులు వేసుకుంటే వేసుకోండి అంటూ పోస్ట్
X

దిశ, సినిమా: 'ది కేరళ స్టోరీ'తో దేశాన్ని కదిలించిన అదా శర్మ, ఇప్పుడు రూటు మార్చి ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమయ్యారు. ఎప్పుడూ వెరైటీగా ఆలోచించే ఈ భామ, తన తదుపరి సినిమా కోసం ఏకంగా 'ప్రపంచాన్ని నాశనం చేసే సూపర్ హీరో'గా అవతారమెత్తుతున్నారు. తాజాగా, ఈ చిత్రానికి 'సూపర్ వెల్లి' (Super Velli) అనే వెరైటీ టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుపుతూ అదా శర్మ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది. ఇందులో గన్ పట్టుకుని లేడీ డాన్‌గా సీరియస్ లుక్‌లో కనిపించిన ఆమె.. వెంటనే కామెడీ చేసి క్యూట్ స్మైల్ ఇచ్చింది. ఆ తర్వాత పోలీసుగా నిందితుల తాట తీస్తూనే లంచం తీసుకుంటూ కనిపించింది. ఇక ఈ పోస్ట్‌కు "ఈ కథ వేరే లోకంలోని నిజమైన వ్యక్తుల జీవితాల నుండి తీసుకున్నది.

ఒకవేళ మన లోకంలో ఎవరైనా దీనివల్ల బాధపడితే.. అది కావాలని చేసినదే అని తెలుసుకుని సర్దుకుపోండి. కేసులు ఏవైనా ఉంటే.. ఆ వేరే లోకంలోనే వేసుకోండి’’ అనే క్యాప్షన్ జత చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. రాజేష్ బచ్చానీ దర్శకత్వంలో వస్తున్న ఈ 'సూపర్ వెల్లి' మాత్రం తన శక్తులతో ప్రపంచాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేస్తుంది. కాకపోతే ఆ పని చేయడానికి కూడా ఆమెకు బద్ధకమే! చిందరవందరగా ఉంటూ, నిద్రపోవడానికి ఇష్టపడే ఈ సూపర్ హీరో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. 'కమెండో' సినిమాలో భావన రెడ్డి పాత్రలో ఉన్న అల్లరిని గుర్తు చేస్తూ ఈ కథను సిద్ధం చేశారట.

ఇక తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ 'ది కేరళ స్టోరీ' పార్ట్-2లో అదా ఎందుకు లేరనే చర్చకు కూడా ఆమె ఫుల్ స్టాప్ పెట్టారు. "నేను లేని సినిమా గురించి మాట్లాడి వార్తల్లో నిలవాలనుకోవడం లేదు. సీక్వెల్‌లో నాకు ఆఫర్ వచ్చిందా? లేదా అనేది నాకు నిర్మాతలకు మధ్య ఉండాల్సిన విషయం. మొదటి భాగం ఆఫ్ఘనిస్తాన్‌లోని ఐసిస్ క్యాంపుల గురించి ఉంటే రెండో భాగం పూర్తిగా కొత్త కథతో రాబోతుంది.పార్ట్-1కు పార్ట్-2కు సంబంధం లేదు" అని తేల్చి చెప్పారు. మొత్తానికి సీరియస్ రోల్స్ తర్వాత అదా మళ్ళీ తన మార్క్ కామెడీతో రాబోతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

షాకింగ్ నిర్ణయం.. ఎట్టకేలకు తన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్న కావ్య కళ్యాణ్ రామ్!

Next Story