షాకింగ్ నిర్ణయం.. ఎట్టకేలకు తన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్న కావ్య కళ్యాణ్ రామ్!

by Mallepaka Hamsa |

కావ్య కళ్యాణ్ రామ్ పెళ్లి పీటలు ఎక్కబోతుందనే వార్తలు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి.

షాకింగ్ నిర్ణయం.. ఎట్టకేలకు తన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్న కావ్య కళ్యాణ్ రామ్!
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి కావ్య కళ్యాణ్ రామ్. ‘మసూద’ చిత్రంతో ప్రాధాన్యత ఉన్న పాత్రలో మెరిసిన ఈ భామ, గతేడాది వచ్చిన ‘బలగం’ సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆ సినిమా సృష్టించిన ప్రభంజనంతో కావ్య ఓవర్ నైట్ స్టార్‌డమ్ సొంతం చేసుకుంది. అయితే, ఆ తర్వాత వరుసగా అవకాశాలు వస్తాయని అందరూ భావించినప్పటికీ, ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. ఆఫర్లు తగ్గుముఖం పట్టడం, సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్‌గా లేకపోవడంతో కావ్య కళ్యాణ్ రామ్ పెళ్లి పీటలు ఎక్కబోతుందనే వార్తలు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి.

ఆమె ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి తనయుడు, సంగీత దర్శకుడు కాళభైరవతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా వీరిద్దరూ రహస్యంగా ప్రేమాయణం నడిపిస్తున్నారని, ఇప్పుడు ఆ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ప్రేమకు ఇరువైపులా ఉన్న పెద్దలు కూడా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. త్వరలోనే వీరిద్దరి నిశ్చితార్థం, పెళ్లి గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కీరవాణి కుటుంబం కూడా కావ్యను కోడలిగా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కావ్య కానీ, కాళభైరవ కానీ స్పందించాల్సి ఉంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు మాత్రం అందుకే సినిమాలకు దూరంగా ఉంటోందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story