నటి బర్త్ డే స్పెషల్.. ‘పరదా’ సినిమా నుంచి దర్శన రాజేంద్రన్ మెస్మరైజింగ్ పోస్టర్ రిలీజ్

by Mallepaka Hamsa |

మలయాళ బ్యూటీ దర్శన రాజేంద్రన్(Darshan Rajendran) పలు చిత్రాల్లో నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది.

నటి బర్త్ డే స్పెషల్.. ‘పరదా’ సినిమా నుంచి దర్శన రాజేంద్రన్ మెస్మరైజింగ్ పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ దర్శన రాజేంద్రన్(Darshan Rajendran) పలు చిత్రాల్లో నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ అమ్మడు ‘హృదయం’ సినిమాతో తన పాపులారిటీని పెంచుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుంది. ‘పరదా’ (Paradha).మూవీలో కీలక పాత్రలో నటించనుంది. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నేడు దర్శన పుట్టినరోజు కావడంతో చిత్రబృందం ఆమెకు విషెస్ తెలుపుతూ ఆమెకు సంబంధించిన లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో అందరినీ మంత్రముగ్దులను చేసే అమిష్ట (Amishta)పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు.

ఇక ఈ పోస్టర్‌లో దర్శన లంగాఓణిలో దర్శనమిచ్చి చిరునవ్వుతో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. కాగా, టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ‘పరదా’ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రాబోతుండగా.. దీనిని ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని ఆనంద్ మీడియా, భాగ్యలక్ష్మి బ్యానర్స్‌పై శ్రీధర్ మక్కువ, విజయ్ డొంకాడ నిర్మిస్తున్నారు. ఇక ఇందులో సీనియర్ నటి సంగీత కూడా కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

twitter link

Next Story