కొడుకు ముందే క్రికెటర్‌ను రెండో పెళ్లి చేసుకున్న నటి.. పోస్ట్‌తో షాకిచ్చిన సంయుక్త

by Mallepaka Hamsa |

కోలీవుడ్ నటి సంయుక్త(samyuktha) పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరిసు, మై డియర్ భైతం, కారీ, తుగ్లక్ దర్బార్, వంటి సినిమాల్లో కనపించింది.

కొడుకు ముందే క్రికెటర్‌ను రెండో పెళ్లి చేసుకున్న నటి.. పోస్ట్‌తో షాకిచ్చిన సంయుక్త
X

దిశ, సినిమా: కోలీవుడ్ నటి సంయుక్త(samyuktha) పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరిసు, మై డియర్ భైతం, కారీ, తుగ్లక్ దర్బార్, వంటి సినిమాల్లో కనపించింది. అలాగే ‘చంద్రముఖి’సీరియల్‌లోనూ నటించింది. అంతేకాకుండా రియాలిటీ షో బిగ్‌బాస్‌లోనూ పాల్గొని తన పాపులారిటీని మరింత పెంచుకుంది. పలు సినిమాలు, షోలతో బిజీగా ఉన్న సమయంలోనే కార్తీక్ శంకర్ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొద్ది రోజులు వీరి కాపురం సాఫీగానే సాగినప్పటికీ ఓ కొడుకు పుట్టిన తర్వాత పలు మనస్పర్థలు తలెత్తాయి. తన భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని విడాకులు తీసుకుంది.

అప్పటి నుంచి కొడుకు బాధ్యతలు తీసుకుని జీవిస్తున్న సంయుక్తకు క్రికెటర్ అనిరుధ్ శ్రీకాంత్‌(Anirudh Srikanth)తో పరిచయం ఏర్పడింది. అది కాస్ ప్రేమగా మారడంతో వీరిద్దరు ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారు. నేడు చెన్నైలో చాలా సింపుల్‌గా సంయుక్త, శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నారు. కొడుకు సమక్షంలోనే వీరిద్దరు ఒక్కటవ్వడం విశేషం. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలను సంయుక్త సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. దీంతో వాటిని చూసిన నెటిజన్లు కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు కొత్త జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

కాగా.. శ్రీకాంత్ విషయానికొస్తే.. తమిళనాడు తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఐపీఎల్‌లో 2008-13 వరకు సీఎస్కే జట్టుకు ప్రాతినధ్యం వహించిన ఆయన 2014లో సన్‌రైజర్స్ తరపున ఆడాడు. 2019 తర్వాత నుంచి క్రికెట్‌కు దూరం అయ్యాడు. ఇక సంయుక్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇది ఆయన కూడా రెండో వివాహం కావడం గమనార్హం. ఇంతకుముందే మోడల్ ఆర్తి వెంకటేష్‌కు పెళ్లి చేసుకోగా... మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు.

Next Story