కమెడియన్‌పై నటి సంచలన వ్యాఖ్యలు.. ఏం అడుగుతాడో నాకు తెలుసు అంటూ బాంబ్ పేల్చిన షకీలా!

by Disha Web Desk 6 |
కమెడియన్‌పై నటి సంచలన వ్యాఖ్యలు.. ఏం అడుగుతాడో నాకు తెలుసు అంటూ బాంబ్ పేల్చిన షకీలా!
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు శృంగార తార షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు వెండి తెరకు కాస్త దూరం అయింది. కోలీవుడ్ లో బుల్లితెరపై షోలు చేస్తుంది. ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ లో సెలెబ్రిటీలతో టాక్ షో కూడా నిర్వహిస్తోంది. ఈ షోలో ఆమె సెలెబ్రిటీలని ఇంటర్వ్యూ చేస్తూ పలు కాంట్రవర్సీ అంశాలను ప్రస్తావిస్తూ ఉంటుంది.

తాజాగా షకీలా ఇంటర్వ్యూలో లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రేమ ప్రియా పాల్గొని కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలుపై ప్రియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘నేను కెరీర్ ఆరంభంలో వివేక్, వడివేలు, సంతానం లాంటి కమెడియన్ తో కలిసి చిన్న చిన్న పాత్రలు చేశాను. ఆఫర్స్ బాగా వచ్చేవి. కానీ వడివేలు నా ఎదుగుదలని అడ్డుకున్నారు. హమ్మయ్య మంచి అవకాశం వచ్చింది అని షూటింగ్ కి వెళ్తే అక్కడ వడివేలు నన్ను చూసి.. ఈ అమ్మాయి వద్దు పంపించి వేయండి అంటూ నిర్మాతలకు చెప్పేవారు. అలా చాలా అవకాశాలు కోల్పోయాను. ఆ తర్వాత ఆయన గురించి బయట చెబితే నన్ను బెదిరించారు’’ అంటూ ప్రియా చెప్పుకొచ్చింది. అది విన్న తర్వాత షకీలా స్పందిస్తూ వడివేలు గురించి నాకు బాగా తెలుసు. షూటింగ్ స్పాట్ లో ఏం చేస్తారు.. ఏం అడుగుతాడో కూడా నాకు తెలుసు అంటూ పరోక్షంగా బాంబు పేల్చింది. దీంతో ప్రస్తుతం ఈ ఇద్దరి నటీమణుల కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Read More: ఇండస్ట్రీలోని హీరోలంతా డమ్మీగాళ్లే.. అతనొక్కడే రియల్ హీరో: మరోసారి శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు



Next Story

Most Viewed