అనారోగ్య సమస్యతో బాధ పడుతున్న నటి.. ‘రానా నాయుడు-2’ ప్రమోషన్స్‌కు దూరం.. ఆందోళనలో ఫ్యాన్స్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ బ్యూటీ సుర్వీన్ చావ్లా(Surveen Chawla) పలు షోస్‌లో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అనారోగ్య సమస్యతో బాధ పడుతున్న నటి.. ‘రానా నాయుడు-2’ ప్రమోషన్స్‌కు దూరం.. ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ సుర్వీన్ చావ్లా(Surveen Chawla) పలు షోస్‌లో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హేట్ స్టోరీ 2(Hate Story 2), అగ్లీ, పార్చ్డ్ వంటి చిత్రాలతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. బాలీవుడ్‌లో ఎన్నో చిత్రాల్లో కనిపించిన ఆమె రానా నాయుడు వెబ్‌సిరీస్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం సుర్వీన్ చావ్లా ‘రానా నాయుడు-2’(Rana Naidu-2) తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దగ్గుబాటి రానా, వెంకటేష్(Venkatesh), సుచిత్ర పిళ్లై,ఆశిష్ విద్యార్థి, అర్జున్ రాంపాల్, కృతి కర్బంద కీలక పాత్రలో నటిస్తున్నారు.

అయితే కరణ్ అన్షుమాన్ తెరకెక్కించిన ఈ సిరీస్ జూన్ 13న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, సుర్వీన్ చావ్లాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె వెన్ను నొప్పితో బాధ పడుతున్నట్లు సమాచారం. ఈ సమస్య కారణంగా సుర్వీన్ ‘రానా నాయుడు-2’ ప్రమోషన్స్‌కు దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఆందోళన చెందుతున్నారు.

Next Story