బిగ్‌బాస్ నిర్వాహకులకు షాకిచ్చిన నటి.. రెండు కోట్ల నష్టపరిహారం ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-18 12:27:00  IST  )

ఆ సమయంలో నేను అనుభవించిన శారీరక, మానసిక క్షోభకు వెలకట్టలేము. అందుకే నాకు జరిగిన నష్టానికి 2 కోట్లు పరిహారం కావాలి అని ఆమె డిమాండ్ చేస్తోంది.

బిగ్‌బాస్ నిర్వాహకులకు షాకిచ్చిన నటి.. రెండు కోట్ల నష్టపరిహారం ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్
X

దిశ, సినిమా: ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ చుట్టూ వివాదాలు కొత్తేమీ కావు. కానీ, తాజాగా ఒక నటి బిగ్‌బాస్ నిర్వాహకులపై చేసిన ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. తన ఆరోగ్యాన్ని పాడు చేసినందుకు గాను ఏకంగా రూ. 2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ నటి మరెవరో కాదు.. ప్రముఖ మోడల్, నటి సోనాల్ రౌత్. హిందీ బిగ్‌బాస్ సీజన్-8లో కంటెస్టెంట్‌గా పాల్గొని ఫైనల్ వరకు వెళ్లిన సోనాల్ రౌత్‌కు మంచి గుర్తింపు ఉంది. అయితే, ఇటీవల ఆమె బిగ్‌బాస్ మరాఠీ సీజన్-6లో పాల్గొంది. అందరూ ఆమె ఈ షోలో చాలా కాలం ఉంటుందని భావించారు. కానీ కేవలం రెండు వారాలకే ఆమె బయటకు వచ్చేసింది. ఈక్రమంలోనే.. సోనాల్ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూసి జనాలు షాక్ అవుతున్నారు. తన ఒంటిపై వచ్చిన దద్దుర్లు, మచ్చల ఫోటోలను షేర్ చేస్తూ.. హౌస్‌లోని దారుణమైన పరిస్థితులను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. "రియాలిటీ షో అంటే ప్రాణాలను పణంగా పెట్టడం కాదు. నిర్వాహకులపై నమ్మకంతోనే మేము హౌస్‌లోకి వెళ్తాము.

కానీ అక్కడ వాతావరణం చాలా అపరిశుభ్రంగా ఉంది. వంటగదిలో ఎలుకలు, బొద్దింకలు స్వైరవిహారం చేస్తున్నాయి. మిగిలిపోయిన ఆహారాన్ని బయట పడేయడం వల్ల ఈ సమస్య మరీ ఎక్కువైంది. హౌస్‌లో టవల్స్, బెడ్ షీట్ల కొరత ఉండటంతో కంటెస్టెంట్స్ ఒకరు వాడిన వస్తువులను మరొకరు వాడాల్సి వచ్చింది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా, పనిష్మెంట్ పేరుతో 17 మంది కంటెస్టెంట్లను కేవలం ఒకే వాష్‌రూమ్‌ను ఉపయోగించమని కోరడం వల్ల తనకు తామర వంటి చర్మ వ్యాధి సోకిందని సోనాల్ పేర్కొంది. "సిగరెట్లు తాగి అక్కడే పడేయడం, అపరిశుభ్రమైన వాతావరణం వల్ల నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. షో నుంచి బయటకు వచ్చి మూడు నెలలైనా ఇప్పటికీ ఆ చర్మ వ్యాధి నన్ను పీడిస్తోంది. ఆ సమయంలో నేను అనుభవించిన శారీరక, మానసిక క్షోభకు వెలకట్టలేము. అందుకే నాకు జరిగిన నష్టానికి 2 కోట్లు పరిహారం కావాలి" అని ఆమె డిమాండ్ చేస్తోంది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. బిగ్‌బాస్ వంటి పెద్ద షోలలో కనీస జాగ్రత్తలు తీసుకోరా? అని నెటిజన్లు నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు.

Divi: జిమ్‌లో స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ బ్యూటీ

Next Story