మానసిక ఆరోగ్యానికి అసలైన మెడిసిన్ ఆ పని చేయడమే అంటూ నటి షాకింగ్ పోస్ట్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా(tanushreedutta) ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన వీడియో ఒకటి చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

మానసిక ఆరోగ్యానికి అసలైన మెడిసిన్ ఆ పని చేయడమే అంటూ నటి షాకింగ్ పోస్ట్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా(tanushreedutta) ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన వీడియో ఒకటి చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె నటుడు నానాపటేకర్.. తనకు కంటిమీద కునుకు లేకుండా చాలా టార్చర్ చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లాగే తనను కూడా చంపడానికి పలువురు ప్రయత్నాలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా తనను బాధపెడుతున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా వెల్లడించింది. ఇదిలా ఉంటే.. తాజాగా, తను శ్రీ దత్త ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వరుస పోస్టులు పెట్టి నెటిజన్ల ట్రోల్స్‌కు గురవుతోంది. ‘‘నన్ను దయ్యంగా చూపించడానికి ధైర్యం చేయకండి. ఏదో ఒక విధంగా దీనిని గెలుస్తాను.

నేను చూసే చాలా మందిలో నైతికత, విలువలు లేవు. తప్పు చేశామన్న పశ్చాత్తాపం కూడా లేదు. ఆత్మపరిశీలన చేసుకోండి.. ముఖాన్ని దాచుకునే బదులు ఎక్కడ తప్పు చేశారో గుర్తు తెచ్చుకోండి. నేను రోజంతా తినకుండా ఉన్నాను. రాత్రి 7 గంటలకు మటన్ తిని ఉపవాసం పూర్తి చేశాను. ఎవరైనా మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా టార్చర్ చేస్తుంటే మీరు తినే ఆహారంపై శ్రద్ధ పెట్టండి. ఆహారం అసలైన మెడిసన్. శ్రావణమాసం కావడంతో రాత్రి ఏడు గంటలకు వరకు ఉపవాసమున్నాను. ఆ తర్వాత పోషకాలున్న పప్పు, మటన్ వండుకుని తిన్నాను. ఉపవాసాలు అంటే కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. వాటిని ఎవరి అవసరాలకు తగ్గట్లుగా మార్చుకోవచ్చు. నాకైతే ఇలాంటి ఉపవాసమే బాగా పని చేస్తోంది’’ అని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు తనుశ్రీ దత్తపై మండిపడుతున్నారు. ఉపవాసం ఉండి మటన్ తినడమేంటని ఫైర్ అవుతున్నారు. ఇక ఓ నెటిజన్ పెట్టిన కామెంట్‌కు.. స్ట్రాంగ్ రిప్లై కూడా ఇచ్చింది. నా గురించి కామెంట్ పెట్టడానికి నీకు అర్హత లేదు. నేను చాలా ఫిట్‌గా ఉన్నాను. ఎలాంటి డ్రెస్ వేసుకున్నe అందంగా కనిపిస్తాను కాబట్టి బాడీ షేమింగ్ చేయడం ఆపు అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Next Story