- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
12 ఏళ్ల కూతురు ఉండగా అతడిని రెండో పెళ్లి చేసుకుని షాకిచ్చిన నటి.. చర్చనీయాంశంగా మారిన వీడియో
గత కొద్ది కాలంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుంటూ పర్సనల్ లైఫ్‌లో ఫుల్ బిజీ అయిపోతున్నారు.

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుంటూ పర్సనల్ లైఫ్‌లో ఫుల్ బిజీ అయిపోతున్నారు. అలాగే కొందరు పెళైన కొద్ది రోజులకే విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. మరికొందరు మాత్రం విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లి కూడా చేసుకుంటూ తమ జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా, ఓ మలయాళ నటి ఆర్య (arya) రెండో పెళ్లి చేసుకుని అందరినీ షాక్‌కు గురి చేసింది. అయితే ఆమె ప్రేమించిన వ్యక్తికి కూడా రెండో వివాహం కావడం గమనార్హం.
అసలు విషయంలోకి వెళితే.. ఆర్యకు ఇప్పటికే వివాహం అయి 12 ఏళ్ల కూతురు ఉండగా.. పలు మనస్పర్థలు తలెత్తడంతో భర్తతో విడాకులు తీసుకుంది. ఇక అప్పటినుంచి కొరియోగ్రాఫర్ సిబిన్(Sibin)తో డేటింగ్ చేస్తోంది. మే నెలలో వీరిద్దరు కలిసి ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ లవ్ బర్డ్స్ ఆగస్టు 21న ఏడడుగులతో ఒక్కటయ్యారు. ఇక ఈ పెళ్లికి సంబంధించిన పనులన్నీ ఆర్య 12 ఏళ్ల కూతురు రోయా చూసుకుంది. తన తల్లిని మండపం వద్దకు స్వయంగా తీసుకొచ్చి తాళి కట్టే సమయంలో పక్కనే ఉంది. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మరికొందరు మాత్రం కంగ్రాట్స్ చెబుతున్నారు.






