పవన్ కళ్యాణ్ పై టాలీవుడ్ హీరోయిన్ సీరియస్..!

by velandi.Saikiran |

ప్రియాంక పవన్ కళ్యాణ్ ను చూస్తూ కాసేపు నవ్వి ఆ తర్వాత సీరియస్ అయింది. చంద్రముఖిలా మారిపోయి... కళ్ళు బయటకు పెట్టి చూసింది

పవన్ కళ్యాణ్ పై టాలీవుడ్ హీరోయిన్ సీరియస్..!
X

దిశ, వెబ్ డెస్క్ : పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటించిన సినిమా OG. ఈ సినిమా రిలీజ్ కు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో.. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుల్ మోహన్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో నిన్న చిన్న ఈవెంట్ నిర్వహించారు.

అయితే ఈ సందర్భంగా... హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఈవెంట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చాడు. ఆ సందర్భంగా పక్కనే నిల్చున్న హీరోయిన్ ప్రియాంక.... పవన్ కళ్యాణ్ ను చూస్తూ... కాసేపు నవ్వి ఆ తర్వాత సీరియస్ అయింది.

చంద్రముఖిలా మారిపోయి... కళ్ళు బయటకు పెట్టి చూసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. అందరూ ఆమెను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను ప్రియాంక సీరియస్ గా చూసిందని కొంతమంది అంటుంటే... ఆమె చంద్రముఖిలా మారిపోతుందని మరి కొంతమంది అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన సీరియస్ అయ్యే అంత దమ్ము ఆమెకు లేదని మరి కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు. క్లిక్

Next Story