పెళ్లైన ఏడేళ్లకు తల్లి కాబోతున్న నటి.. బేబీ బంప్ ఫొటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

ప్రీత ప్రదీప్ తన మొదటి సంతానానికి జన్మనివ్వబోతుండటంతో అటు కుటుంబ సభ్యుల్లోనూ, ఇటు అభిమానుల్లోనూ ఆనందం వెల్లివిరుస్తోంది.

పెళ్లైన ఏడేళ్లకు తల్లి కాబోతున్న నటి.. బేబీ బంప్  ఫొటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: మలయాళ వెండితెరపై తనదైన ముద్ర వేయడమే కాకుండా, బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, డ్యాన్సర్‌గా సుపరిచితురాలైన నటి ప్రీత ప్రదీప్(Preetha Pradeep) ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉంది. వివాహం జరిగిన ఏడేళ్ల తర్వాత ఆమె తన మొదటి సంతానానికి జన్మనివ్వబోతుండటంతో అటు కుటుంబ సభ్యుల్లోనూ, ఇటు అభిమానుల్లోనూ ఆనందం వెల్లివిరుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకున్న అప్‌డేట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రీత తొమ్మిదో నెలలో ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నసమయంలో, ఆమె ఒక అద్భుతమైన ఫోటోషూట్‌ను నిర్వహించారు. సాధారణంగా బేబీ బంప్ ఫోటోషూట్స్ వెస్ట్రన్ స్టైల్‌లో ఉంటాయి, కానీ ప్రీత మాత్రం చాలా వెరైటీగా ప్లాన్ చేశారు.

తన బేబీ బంప్‌పై ఎంతో కళాత్మకంగా మెహందీ వేయించుకుని, సాంప్రదాయబద్ధంగా ముస్తాబై దిగిన ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు "అమ్మతనం ఆమెలో కొత్త కళను తెచ్చింది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా..ప్రీత ప్రదీప్, వివేక్(Vivek) 2019, ఆగస్టు 25న వివాహం చేసుకున్నారు. పెళ్లైనప్పటి నుండి ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అయితే పెళ్లైన ఏడేళ్ల తర్వాత వారు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతుండటంతో ఈ ప్రయాణం వారికి ఎంతో ప్రత్యేకం కానుంది. ఈ విషయంపై ప్రీత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా "మా జీవితంలోకి కొత్త వెలుగు రాబోతోంది.మాతృత్వం అంటే ప్రేమ దాని అత్యంత పేద రూపాన్ని సంతరించుకుని శ్వాసతో ప్రారంభమవుతుంది. ఈ రోజు, నాలో పెరుగుతున్న అద్భుతాన్ని నేను జరుపుకుంటున్నాను" అని పేర్కొంటూ ఆమె పెట్టిన పోస్ట్ అభిమానుల మనసు గెలుచుకుంది.

Next Story