- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నటి ప్రగతిపై ట్రోల్స్.. నెటిజన్లకు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్
సింగర్ చిన్మయి(Chinmayi) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్లే బ్యాక్ సింగర్‌గానే కాకుండా సమంతకు డబ్బింగ్ కూడా చెప్పి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది

దిశ, సినిమా: సింగర్ చిన్మయి(Chinmayi) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్లే బ్యాక్ సింగర్‌గానే కాకుండా సమంతకు డబ్బింగ్ కూడా చెప్పి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక గత కొద్ది కాలంగా తన వృత్తికి దూరంగా ఉన్నప్పటికీ చిన్మయి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంది. ఆమె చేసే పోస్టులు కారణంగా వివాదాలలో నిలుస్తూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారి గురించి మాత్రమే కాకుండా మహిళల గురించి తప్పుగా మాట్లాడినా, ఏదైనా జరిగినా ఆ ఘటనపై వెంటనే స్పందిస్తూ.. తన అభిప్రాయాన్ని పోస్టులు ద్వారా తెలియజేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు చిన్మయి చేసే పోస్టులు ద్వారా ట్రోల్స్‌ను కూడా ఎదుర్కొంది. అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తనదైన స్టైల్లో పలు పోస్టులు పెడుతూ ఉంటుంది. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ వాటిని లెక్క చేయకుండా మహిళలకు మద్దతుగా నిలుస్తుంటుంది. తాజాగా, చిన్మయి నటి ప్రగతికి సపోర్ట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది.
అసలేం జరిగిందంటే.. నటి ప్రగతి (pragathi)పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. నాలుగు పదుల వయసుల్లో ఉన్న ప్రగతి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటూ సంచలనాలను సృష్టిస్తోంది. ఇక ఇటీవల టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. ఈ పోటీలలో ఒక బంగారు పతకంతో పాటు మూడు రజిత పథకాలను సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈక్రమంలోనే.. నటి ప్రగతిపై సినీ సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెడుతున్నారు.
ఇక గతంలో ప్రగతిపై విమర్శలు చేసిన వారు కూడా ఆమెను పొగుడుతున్నారు. ఈనేపథ్యంలో.. ఈ విషయంపై సింగర్ చిన్మయి కూడా స్పందిస్తూ ప్రగతిని విమర్శించిన వారికి కౌంటర్ ఇచ్చింది. ‘‘ప్రగతి గారి ఫొటోల గురించి అసభ్యకరమైన కామెంట్లు పెట్టినవారు వాళ్ల జీవితంలో ఏం సాధించారు? అలాంటివారు ఎప్పటికీ ఏమి సాధించలేరు. అలాగే అమ్మాయిలకు ఆమె సలహా ఇస్తూ మీరంతా కూడా ప్రగతి గారి నుంచి స్ఫూర్తి పొంది ముందుకు వెళ్ళండి. మీపై వచ్చే చెడు కామెంట్లను తీసి పక్కన పడేయండి. అలాగే మీరు భవిష్యత్తులో ఇలాంటి వారి కుటుంబంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడండి’’ అని రాసుకొచ్చింది. ప్రగతికి సపోర్ట్ చేయడంతో పాటు ఫొటోను షేర్ చేస్తూ.. అమ్మాయిలు స్ఫూర్తిగా తీసుకోవాలని సలహా ఇచ్చింది. ప్రజెంట్ చిన్మయి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






