- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భర్తకు దూరంగా నటి పూర్ణ.. పోస్ట్ చర్చనీయాంశంగా మారడంతో విడాకులు తీసుకోబోతున్నారా అంటున్న నెటిజన్లు
ఒకప్పటి హీరోయిన్ పూర్ణ (poorna)అందరికీ సుపరిచితమే. సీమటపాకాయ్, అవేను వంటి చిత్నాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

దిశ, సినిమా: ఒకప్పటి హీరోయిన్ పూర్ణ (poorna)అందరికీ సుపరిచితమే. సీమటపాకాయ్, అవేను వంటి చిత్నాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారింది. అఖండ, దసరా, భీమా వంటి సినిమాల్లో నటించిన పూర్ణ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’(guntur karam)లో స్పెషల్ సాంగ్‌లో ఆడి పాడి బాక్సాఫీసును షేక్ చేసింది. ఇక పూర్ణ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు వరుస సినిమాలతో కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీ(Shahid Asif Ali)ని 2022లో పెళ్లి చేసుకుంది. 2023లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
ఆ తర్వాత తన కొడుకు కోసం కొద్ది రోజులు సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది. ఇటీవల ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చిన పూర్ణ వరుస చిత్రాల్లో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా, పూర్ణ భర్త ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారి అందరిలో పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ‘‘నా జీవితంలో ఈ 45 రోజులను నేనెప్పటికీ మర్చిపోలేను. ఒంటరితనాన్ని, నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నాను. నీ జ్ఞాపకాలతోనే రాత్రులు కూడా గడపాల్సి వచ్చింది. ప్రతిరోజు ఉదయం నిన్ను తలచుకొని ఏడ్చేవాడిని ముఖ్యంగా మనల్ని ప్రేమించే వారు మనతో ఉండడమే జీవితంలో అఅంతకంటే గొప్ప వరము. ఈ 45 రోజుల్లో నాకు నీ ప్రేమ గొప్పతనం తెలిసి వచ్చింది.
ఈ రోజు నా భార్య నా దగ్గరకు వచ్చేసింది. ఎన్నో ఎదురుచూపుల తర్వాత నా భార్యను చూసి తట్టుకోలేకపోయాను అందుకే ఈ పోస్ట్ పెడుతున్నాను’’ అని రాసుకొచ్చాడు. దీంతో వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో.. అసిఫ్ మరో పోస్ట్‌తో ఆ వార్తలకు క్లారిటీ ఇచ్చాడు. ‘‘నా భార్య 45 రోజులు నాకు దూరంగా ఉంది. పెళ్లి జరిగిన తర్వాత ఎప్పుడూ కూడా ఇన్ని రోజులు దూరంగా ఉండలేదు. అందుకే అలా పోస్ట్ పెట్టాను. దయచేసి మీరు తప్పుడుగా అర్థం చేసుకొని ఉన్నవిలేనివి కలిసి రాయొద్దు. దేవుడి దయతో మేమంతా సంతోషంగానే ఉన్నాము’’ అని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి.






