పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ.. అపురూపమైన కానుక దక్కిందంటూ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

తను మా జీవితాల్లోకి వచ్చిన అపురూపమైన కానుక.

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ.. అపురూపమైన కానుక దక్కిందంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటి ‘ఢీ’ జడ్జి పూర్ణ తన అభిమానులకు అదిరిపోయే తీపికబురు అందించారు. ఆమె రెండోసారి తల్లి అయినట్లు ప్రకటించారు. ఈ రోజు (మార్చి 14, 2026) తెల్లవారుజామున ఆమె ఒక పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని పూర్ణ, ఆమె భర్త షానిద్ ఆసిఫ్ అలీ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. "భగవంతుడి ఆశీస్సులతో ఈరోజు ఉదయం 4 గంటల 25 నిమిషాలకు మాకు పాప పుట్టింది. తను మా జీవితాల్లోకి వచ్చిన అపురూపమైన కానుక. ఎటువంటి ఇబ్బందులు లేకుండా డెలివరీ సాఫీగా జరిగినందుకు ఆ దేవుడికి, అలాగే నన్ను పర్యవేక్షించిన ఆసుపత్రి బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు" అని పేర్కొన్నారు. తన కొడుకు హమ్దాన్‌కు తోడుగా ఇప్పుడు చిట్టి చెల్లి వచ్చిందని ఆమె మురిసిపోయారు.

ఇక 2022లో దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకున్న పూర్ణ, 2023లో మొదటిసారి బాబుకు జన్మనిచ్చారు. మళ్ళీ ఇప్పుడు పాప పుట్టడంతో పూర్ణ కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. గత కొద్ది రోజులుగా తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న పూర్ణ, తన గర్భధారణ సమయాన్ని ఎంతో ఆనందంగా గడిపారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఈ వార్త విన్న సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన నటనతో, డ్యాన్స్‌తో వెండితెరపై, బుల్లితెరపై సందడి చేసే పూర్ణ, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో మరో మధురమైన ఘట్టాన్ని ఆస్వాదిస్తున్నారు.

Next Story