70 ఏళ్ల ముసలాడైనా ప‌ర్లేదు...హీరోయిన్ మీనాక్షి బోల్డ్ కామెంట్స్ !

by velandi.Saikiran |

ఎలాంటి సినిమాలు అయినా కథ నచ్చితే, చేస్తానని వెల్లడించింది. సీనియర్ హీరోలు సరసన నటిస్తానని పేర్కొంది మీనాక్షి

70 ఏళ్ల ముసలాడైనా ప‌ర్లేదు...హీరోయిన్ మీనాక్షి బోల్డ్ కామెంట్స్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నప్పటికీ, కొంతమంది దూసుకు వెళ్తున్నారు. అలాంటి వారిలో మీనాక్షి చౌదరి ( Meenakshi Chaudhary) ఒకరు. ఇచ్చట వాహనములు నిలుప‌రాదు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ పొడుగు కాళ్ళ సుందరి మీనాక్షి, ఆ తర్వాత రవితేజ, మహేష్ బాబు లాంటి పెద్ద హీరోల సరసన నటించింది. ఇక మొన్నటికి మొన్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో బంపర్ హిట్ అందుకుంది ఈ అందాల తార.

ప్రస్తుతం విశ్వంభర సినిమాలో న‌టిస్తోంది. భ‌విష్య‌త్తులో సినిమాలు చేయ‌డంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది మీనాక్షి చౌదరి. ఎలాంటి సినిమాలు అయినా కథ నచ్చితే, తాను చేస్తానని వెల్లడించింది. సీనియర్ హీరోలు అయినా సరే, వాళ్ల సరసన నటిస్తానని పేర్కొంది. కానీ, పిల్లల తల్లిగా కనిపించే పాత్ర వస్తే, మాత్రం రిజెక్ట్ చేస్తానని వెల్లడించింది. లక్కీ భాస్కర్ ( Lucky Baskhar ) సినిమా సమయంలో అనివార్య కారణాలవల్ల తల్లి పాత్ర పోషించాలని స్పష్టం చేసింది. ఇకపై తల్లి పాత్ర పోషించబోనని వివరించింది. కానీ 70 ఏళ్ళు ఉన్న హీరో సరసన ఛాన్స్ వ‌స్తే సినిమా చేస్తానని హింట్ ఇచ్చారు.

Next Story