- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసుపత్రిలో చేరిన నటి ఖుష్బూ .. పాపం కారణం ఏంటి..
మచ్చలేని అందంతో, మంచి నటనా నైపుణ్యంతో మిలియన్ల మంది హృదయాలను గెలుచుకున్న ఖుష్బూ సుందర్.. తాజాగా తన హెల్త్ అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకుంది.

దిశ,సినిమా: మచ్చలేని అందంతో, మంచి నటనా నైపుణ్యంతో మిలియన్ల మంది హృదయాలను గెలుచుకున్న ఖుష్బూ సుందర్.. తాజాగా తన హెల్త్ అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకుంది. రీసెంట్ గా ట్వీట్‌లో కోకిక్స్ ఎముక శస్త్రచికిత్స గురించి ట్వీట్ చేసింది. "నిన్న నా కోకిక్స్ ఎముకకు ఒక ప్రక్రియ జరిగింది. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్లి. 2 రోజులు విశ్రాంతి తీసుకుని, మళ్ళీ పనికి వెళ్తాను'' అంటూ ఆసుపత్రి నుంచి ఆమె ఫోటోను పంచుకున్నారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని తన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 'అక్కా త్వరగా కోలుకోండి, ఈ రకమైన ఫోటోలు చూడటం కొంచెం బాధగా ఉంది, మీరు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను, మీ అన్ని సత్కార్యాలు & సత్కర్మలు తిరిగి వస్తాయి.. అక్క జాగ్రత్త ' అంటూ తనను కుటుంబంలో ఒక్కరి గా భావిస్తున్నారు ఫ్యాన్స్.
ఇవి కూడా చదవండి :
ఎట్టకేలకు విడాకులపై క్లారిటీ ఇచ్చిన Samantha.. ?
ఆరుగురిపై లైంగిక దాడి చేసిన డైరెక్టర్.. సపోర్ట్‌గా నిలిచిన నటి






