ఈమె ఎవరో గుర్తు పట్టారా..?

by Dishafeatures2 |
ఈమె ఎవరో గుర్తు పట్టారా..?
X

దిశ, వెబ్ డెస్క్: నటి హరితేజ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో నితిన్ హీరోగా వచ్చిన ‘‘అఆ’’ మూవీతో హరితేజ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమాలో సమంతకు వ్యక్తిగత సహాయకురాలిగా మంగమ్మ పాత్రలో హరితేజ ప్రేక్షకులను అలరించింది. అనంతరం విన్నర్, దువ్వాడ జగన్నాథం, నేనే రాజు నేనే మంత్రి, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక 2021లో వచ్చిన అల్లుడు అదుర్స్ లో ఆమె చివరిసారిగా కనిపించింది. ఇక 2017లో వచ్చిన తెలుగు బిగ్ బాస్ లో పాల్గొన్న హరితేజ.. మూడో స్థానాన్ని సంపాదించుకుంది. అంతకు ముందు చాలా సీరియల్స్ లో హరితేజ నటించింది.


2015లో హరితేజకు దీపక రావుతో వివాహం కాగా 2021లో హరితేజ ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే ఆమె నటనకు దూరమైంది. అయితే చాలా రోజుల తర్వాత హరితేజ మళ్లీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ముద్దుగాబొద్దుగా ఉండే హరితేజ.. ఈసారి స్లిమ్ గా తయారైంది. పసుపు రంగు చీరలో నాజూకుగా కనిపించింది. ఈ ఫోటోలను హరితేజ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇక హరితేజ తాజా ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ‘‘మరి అంత సన్నగా ఉంటే ఎలా మేడం, బాలేదు.. బొద్దుగానే బావుంటారు’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారా.. ఇంత స్లిమ్ గా తయారయ్యారు అంటూ మరొకరు కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి: సమంత కళ్లద్దాలు పెట్టుకోవడానికి అదే కారణమట!

Next Story

Most Viewed