పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి.. లిటిల్ స్టార్ ఆగయా అంటూ పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

మోడల్, నటి, నిర్మాత, దర్శకురాలిగా మల్టీ టాలెంట్‌తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రుచిరాసింగ్(Ruchira Singh) అందరికీ సుపరిచితమే.

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి.. లిటిల్ స్టార్ ఆగయా అంటూ పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: మోడల్, నటి, నిర్మాత, దర్శకురాలిగా మల్టీ టాలెంట్‌తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రుచిరాసింగ్(Ruchira Singh) అందరికీ సుపరిచితమే. కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఈ అమ్మడు నటుడు వినీత్ కుమార్ సింగ్‌(Vineet Kumar Singh)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2021లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న ఈ జంట ఇటీవల తల్లిదండ్రులు కాబోతున్నట్లు వెల్లడించారు. ఇక అప్పటినుంచి బేబీ బంప్ ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, వినీత్, రుచిరా తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తనకు జులై 24 న బాబు పుట్టినట్లు తెలుపుతూ లిటిల్ స్టార్‌కు ఘనంగా వెల్‌కమ్ చెప్పింది. ‘‘దేవుని దయ పొంగిపొర్లుతుంది! అతి చిన్న సింగ్ వచ్చాడు.

అతను ఇప్పటికే హృదయాలను, పాల సీసాలను దొంగిలిస్తున్నాడు. ఈ విలువైన బహుమతిని ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అనే క్యాప్షన్ జత చేసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కంగ్రాట్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, వినీత్ కుమార్ సింగ్ కూడా నటుడే. ఆయన ఇటీవల బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఛావా’లో కీలక పాత్రలో కనిపించాడు. విక్కీ కౌశల్, రష్మికా మందన్న జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఘన విజయం సాధించడంతో పాటు ‘ఛావా’ భారీ కలెక్షన్లు కూడా రాబట్టింది. దీంతో పాటు వినీత్ బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు, మూవీస్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు.

Next Story