ఆ డైరెక్టర్ తో ఈషా రెబ్బ రిలేష‌న్‌..? ఇదిగో ఫోటోలు

by velandi.Saikiran |   (  Updated:2025-10-21 07:20:12  IST  )

దర్శకుడు తరుణ్ భాస్కర్ తో ఈషా రెబ్బ‌ మెరిశారు. దీపావళి టపాకాయలు పేల్చుతూ సందడి చేశారు. విశ్వక్ సేన్‌ ఇంట్లో ఈ

ఆ డైరెక్టర్ తో ఈషా రెబ్బ రిలేష‌న్‌..? ఇదిగో ఫోటోలు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ‌ గురించి తెలియని వారు ఉండరు. 2012 సంవత్సరంలో లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాతో మెరిసిన ఈ అందాల తార పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా ఛాన్స్ కొట్టేసింది. పెద్ద హీరోయిన్ గా పేరు సక్సెస్ కాలేకపోతున్న ఈశా రెబ్బ, చిన్న పాత్రలు వచ్చినా చేస్తోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అరవింద సమేత వీర రాఘవ లాంటి సినిమాలలో సైడ్ హీరోయిన్ పాత్రలు చేసి మెప్పించింది. అయితే అలాంటి ఈషా రెబ్బ‌ ఈ మధ్యకాలంలో పిట్టకథలు, 3రోజెస్ లాంటి వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఇది ఇలా ఉండగా తాజాగా ఈషా రెబ్బ‌ గురించి ఓ సంచలన విషయం బయటకు వచ్చింది.

దీపావళి సందర్భంగా దర్శకుడు తరుణ్ భాస్కర్ తో ఈషా రెబ్బ‌ మెరిశారు. దీపావళి టపాకాయలు పేల్చుతూ సందడి చేశారు. విశ్వక్ సేన్‌ ఇంట్లో ఈ దీపావళి వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో విశ్వక్ సేన్‌ ఇంటికి తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ‌ కలిసి వెళ్లారు. దీంతో వీళ్లిద్దరూ క్లోజ్ గా కనిపించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే త‌రుణ్‌, ఈషా రెబ్బ‌ మధ్య రిలేషన్ ఉందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని మ‌రికొంద‌రు అంటున్నారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈషా రెబ్బ‌ త్వరలో కొత్త సినిమా చేయబోతున్నారని, అందుకే అతనితో వెళ్ళినట్లు చెబుతున్నారు. క్లిక్

READ MORE .....

BANDLA GANESG: ఏం జరిగినా తల ఎత్తుకుని ఉండు.. ఆత్మవిశ్వాసం కోల్పోకు

Next Story