గుడ్ న్యూస్ ప్రకటించిన నటి.. మేము ముగ్గురం కాబోతున్నామంటూ పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

గత కొద్ది కాలంగా సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెడుతున్నారు. ఎంగేజ్‌మెంట్, పెళ్లిళ్లు చేసుకుంటూ బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెబుతున్నారు.

గుడ్ న్యూస్ ప్రకటించిన నటి.. మేము ముగ్గురం కాబోతున్నామంటూ పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెడుతున్నారు. ఎంగేజ్‌మెంట్, పెళ్లిళ్లు చేసుకుంటూ బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెబుతున్నారు. అలాగే కొందరు నటీమణులు ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటిస్తూ తల్లిగా ప్రమోషన్ పొందుతున్నారు. తాజాగా, బుల్లితెర నటి హర్షిత (Harshita)ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గుడ్ న్యూస్ ప్రకటించింది. ఇద్దరం కాస్త ముగ్గురం అవుతున్నామంటూ బేబీ బంప్‌తో దర్శనమిచ్చింది. పెళ్లైన ఐదు సంవత్సరాలకు తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలియజేసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు కంగ్రాట్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా, హర్షిత విషయానికొస్తే.. ఈ అమ్మడు లక్ష్మీ కళ్యాణం, అమ్మకోసం వంటి సీరియల్స్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అలాగే కన్నడలోనూ పలు సిరీయల్స్ షోస్ చేసిన హర్షిత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగానే.. వినయ్ శ్యామ్‌సుందర్‌(Vinay Shyamsunder)ను పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లైన తర్వాత కూడా సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా ఇస్మార్ట్ జోడీ సీజన్-2లోనూ భర్తతో పాల్గొని విన్నర్స్‌గా నిలిచారు. ట్రోఫీ అందుకోవడంతో పాటు రూ. 25 లక్షల ప్రైజ్‌మనీ సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్శించారు. అలాగే సోషల్ మీడియాలోనూ వరుస పోస్టులు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నారు.

Next Story