స్పెషల్ డే నాడే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటుడి భార్య.. గ్రేటెస్ట్ గిఫ్ట్ అంటూ పోస్ట్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ కపుల్ రాజ్‌కుమార్ రావు(Rajkumar Rao)- పాత్రలేఖ(Patralekha) ఇటీవల తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

స్పెషల్ డే నాడే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటుడి భార్య.. గ్రేటెస్ట్ గిఫ్ట్ అంటూ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ కపుల్ రాజ్‌కుమార్ రావు(Rajkumar Rao)- పాత్రలేఖ(Patralekha) ఇటీవల తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పెళ్లైన మూడేళ్లకు గుడ్ ప్రకటించడంతో అభిమానులు ఫుల్ సంతోషపడుతున్నారు. తాజాగా, ఈ జంట డబుల్ గుడ్ శుభవార్తలు ప్రకటించారు. తమ 4వ పెళ్లి రోజు నాడే తమకు పండంటి ఆడపిల్ల పుట్టిందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దేవుడి ఆశీర్వాదలతో గ్రేటెస్ట్ గిఫ్ట్ పొందామని సంతోషంలో మునిగి తేలుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. అది చూసిన అభిమానులు, సినీ సెలబ్రిటీలు కంగ్రాట్స్ చెబుతున్నారు.

కాగా..రాజ్ కుమార్ రావు పాత్రలేఖ 2014లో ఓ సినిమాతో ప్రేమలో పడ్డారు. కొద్దికాలంపాటు ప్రేమించుకున్న వీరిద్దరు 2021లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జూలై 9న తల్లిదండ్రులు కాబోతున్న ప్రకటించారు. ఇప్పుడు ఈ జంటకు ఓ ఆడపిల్ల పుట్టింది. దీంతో తమ పెళ్లి రోజు మరింత ప్రత్యేకంగా మారింది. కాగా.. రాజ్ కుమార్ రావు సినిమాల విషయానికొస్తే..‘స్త్రీ-2’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించారు. ఇటీవల మాలిక్, భూల్ చుక్ మాఫ్ వంటి చిత్రాలతో మెప్పించారు.

Next Story