మోదీ, రాహుల్ గాంధీ ఎవ‌రు బెస్ట్ లీడ‌ర్‌..? హీరోయిన్ తాప్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

by velandi.Saikiran |

ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ లలో మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు అనే ప్రశ్నకు హీరోయిన్ తాప్సీ ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మోదీ, రాహుల్ గాంధీ ఎవ‌రు బెస్ట్ లీడ‌ర్‌..? హీరోయిన్ తాప్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: హీరోయిన్ తాప్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసే తాప్సీ, అప్పట్లో తెలుగులో కూడా మెరిసింది. కానీ తెలుగులో ఎక్కువగా అవకాశాలు ఆమెకు రాలేదు. ఆమె ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ అయిన దాఖలాలు కూడా లేవు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం తాప్సికి మంచి ట్రాక్ రికార్డు ఉంది.. దీంతో అక్కడే వెబ్ సిరీస్ లు, భారీ బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే అలాంటి హీరోయిన్ తాప్సీ పొలిటికల్ కామెంట్స్ చేసి ఇప్పుడు వివాదంగా మారారు.

నాకు ఇంకా ఇండియాలో బతకాలని ఉంది అంటూ కామెంట్

అగ్ర హీరోయిన్ తాప్సీ తాజాగా ప్రధాని నరేంద్ర మోడీపై కామెంట్ చేసి వైరల్ గా మారారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ లలో మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు అనే ప్రశ్నకు హీరోయిన్ తాప్సీ ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రశ్నకు వెంటనే నరేంద్ర మోడీ ఫోటో ఎంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ తాప్సీకి ఈ ప్రశ్న ఎదురయింది.

దీంతో వెంటనే నరేంద్ర మోడీ ఫోటో చూపించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఎంచుకోవడమే కాకుండా... తనకు ఇంకా ఇండియాలో బతకాలని ఉంది అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఆమె వ్యంగంగా సమాధానం ఇచ్చారు అంటూ వీడియోను వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే ఈ విషయంలో కొంతమంది ఆమెను ట్రోలింగ్ చేస్తుంటే.. మరి కొంతమంది సపోర్ట్ గా నిలుస్తున్నారు.

Next Story