- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఓజీ’లో కీలక పాత్రలో నటిస్తే ఎడిటింగ్‌లో తీసేశారు.. సెన్సేషనల్ ట్వీట్‌తో షాకిచ్చిన హీరో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సుజీత్ కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘ఓజీ’.

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సుజీత్ కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘ఓజీ’. ఇందులో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi) ప్రతినాయకుడిగా కనిపించారు. పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈక్రమంలో.. ఈ చిత్రంలో టాలీవుడ్ డైరెక్టర్, నటుడు రాహుల్ రవీంద్ర కూడా ఉన్నట్లు పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈక్రమంలో.. తాజాగా, ట్విట్టర్ ద్వారా రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran)ఆ వీడియోలపై క్లారిటీ ఇచ్చారు. ‘‘ఇలాంటి ట్వీట్లు చాలా వస్తున్నాయి. అవును అది నేనే. మొదట్లో చాలా ఆసక్తికరమైన పాత్ర చేశాను.కానీ చాలా కట్ చేయాల్సి వచ్చింది. జీతుని దగ్గరగా చూస్తూ పనిచేయడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా అతను తన విజువల్స్ ఎలా మలచాడో గమనించి నేర్చుకోవడం ఇంకా బాగుంది. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది’’అని రాసుకొచ్చారు. ఇక ఓ అభిమాని చాలా బాధకరం అని పోస్ట్ పెట్టగా.. దానికి స్పందిస్తూ.. ‘‘దర్శకులు సినిమాను బాగా తీయడానికి ఏమైనా చేయాలి బ్రో.
అదే అతి ముఖ్యమైన విషయం ఇది మంచి విషయం. తరచుగా అలాంటి నిర్ణయాలలో చాలా అంశాలు ఉంటాయి. ఇది అర్థం చేసుకోవాలి’’ అని తెలిపారు. ఏదైనా సినిమాలోంచి తమ సీన్స్ తొలగిస్తే ఎంతోమంది నానా రబస చేసిన సంగతి తెలిసిందే. అంత కష్టపడి నటిస్తే తొలగించారని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కానీ రాహుల్ అలా చేయకుండా అర్థం చేసుకొని వారికి సపోర్ట్ ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.






