- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమాల్లోకి రోజా రీ ఎంట్రీ.. అసలు విషయం ఇదే !
సినీ నటి, రాజకీయ నాయకురాలు, నగరి మాజీ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. ఇక సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో ఆమె రాజకీయాల వైపు

దిశ, సినిమా : సినీ నటి, రాజకీయ నాయకురాలు, నగరి మాజీ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. ఇక సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో ఆమె రాజకీయాల వైపు ఇంట్రెస్ట్ చూపింది. నగరి నుంచి రెండు సార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక మంత్రిగా కూడా పని చేసింది. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ దారుణంగా ఓడిపోయింది. అంతే కాకుండా, హీరోయిన్ రోజా ఓటమి పాలు కావడంతో ఆమెపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ అవుతుంది.
ఎందుకంటే ఆమె వైసీపీ గెలుస్తుంది అనే ధీమాతో చాలా దారుణంగా మాట్లాడింది. స్టార్ హీరోలు అనే గౌరవం కూడా లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసి, చిత్ర పరిశ్రమలో తనకు ఉన్న మంచి పేరును కూడా పోగొట్టుకుంది. దీంతో రాజకీయాల్లో ఓటమి తర్వాత ఈమె జర్నీ ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందని చెప్పాలి. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె జబర్ధస్త్‌కు రీ ఎంట్రీ ఇస్తుందని అనేక వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటికే జబర్దస్త్ ఆదరణ కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో మల్లెమాల ఎక్స్ ట్రా జబర్ధస్త్‌ను కూడా తీసివేసింది. దీని బట్టి చూస్తే ఆమె జబర్దస్త్‌లోకి వెళ్లే అవకాశాలు లేవు. టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఈమెకు అవకాశాలు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే చిరు, పవన్ కళ్యాణ్‌ను దారుణంగా తిట్టింది. అయితే ఈమె కోలీవుడ్ వెళ్లడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ హీరో, హరోయిన్స్‌కు తల్లి పాత్రలు చేస్తూ మళ్లీ కెరీర్‌ను కొత్తగా డిజైన్ చేసుకోవాలని రోజా ఆలోచిస్తున్నట్లు పలువురు అంటున్నారు. కానీ ఆమె అభిమానులు మాత్రం రోజా సినిమాల్లోకి రాబోతున్నట్లు ఎలాంటి సమాచారం. లేదు ఆమె పార్టీ పనుల్లో నిమగ్నం అవుతారా? లేదా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తారా అనేదానిపై ఇప్పటికైతే ఎలాంటి సమాచారం లేదు అని చెబుతున్నట్లు తెలుస్తోంది.






