హన్సిక నన్ను ముట్టుకోవడానికి కూడా ఇష్ట పడలేదు.. వివాదాస్పదంగా నటుడు కామెంట్స్ వైరల్

by Disha Web Desk 7 |
హన్సిక నన్ను ముట్టుకోవడానికి కూడా ఇష్ట పడలేదు.. వివాదాస్పదంగా నటుడు కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లు అర్జున్ ‘దేశముదురు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ హన్సిక. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అప్పట్లో అమ్మడుకి ఆఫర్లు గట్టిగానే వచ్చాయి. తర్వాత తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తున్న హన్సిక తమిళంలో సెటిల్ అయ్యారు. ఇక 2022లో బిజినెస్ మాన్ సోహైల్ వివాహం చేసుకుని ఈమె.. ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ నటుడు.

ఆది, హన్సిక కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘పార్టనర్’. నూతన దర్శకుడు మనో దామోధరన రూపొందించిన ఈ మూవీలో నాండియారాజన్, యోగిబాబు, రోబో శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు మూవీ యూనిట్. ఈ క్రమంలోనే ప్రెస్ మీట్లో పాల్గొన్న రోబో శంకర్ హన్సికపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వేదిక మీద హన్సిక కూర్చుని ఉండగా ఆమె ముందే.. దర్శకుడు ఎంత చెప్పినా హన్సిక నా కాలు తాకను అన్నారు. ఆమె నన్ను ముట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఆమె ప్రవర్తనకు దర్శకుడితో పాటు సెట్‌లో ఉన్న వాళ్లమంతా ఆశ్చర్యపోయామని రోబో శంకర్ తెలిపాడు. దీంతో రోబో శంకర్ తీరుపై మీడియా వాళ్లు ఫైర్ అయ్యారు. ఈయనకు మర్యాద.. వృత్తి నైపుణ్యం లేవంటూ ఓ మహిళ జర్నలిస్ట్ మండి పడింది. అయితే రోబో శంకర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు జాండిస్ సోకింది. మానసిక పరిస్థితి కూడా బాగోలేదని కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చినట్లు సమాచారం. కాగా.. రోబో శంకర్ పబ్లిక్‌లో చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి.

Read More: విజయ్ ‘లియో’లో చరణ్ కూడా ఉన్నాడా? ఇక తర్వాత జరిగేది ఏంటంటే

Next Story

Most Viewed