Tarakaratna Passes away హైదరాబాద్‌కు నటుడు నందమూరి తారకరత్న తరలింపు..?

by Disha Web Desk 19 |
Tarakaratna Passes away  హైదరాబాద్‌కు నటుడు నందమూరి తారకరత్న తరలింపు..?
X

దిశ, వెబ్‌డెస్క్: తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు తెలిపారు. తీవ్ర గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న తారకరత్నను చూసేందుకు శుక్రవారం గంటా శ్రీనివాస్ ఆసుపత్రికి వెళ్లారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి ఆయన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడిన గంటా.. తారకరత్న హెల్త్ కండీషన్ ప్రస్తుతం క్రిటికల్‌గా ఉందన్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించే విషయంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. డాక్టర్లతో చర్చలు జరిపిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఇదిలా ఉండగా.. తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో వైద్యులు చర్చిస్తున్నారు. కాగా, మెరుగైన వైద్యం కోసం ఇవాళ రాత్రి తారకరత్నను హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్ అంబులెన్స్ ద్వారా తారకరత్నను బెంగళూర్ నుండి హైదరాబాద్‌‌కు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విదేశీ వైద్యులు బృందం ఆధ్వర్యంలో తారకరత్నకు మైరుగైన వైద్యం అందిస్తున్నారు.

Also Read..

బిగ్ బ్రేకింగ్ న్యూస్: నటుడు నందమూరి తారకరత్న కన్నుమూత....శోకసంద్రంలో నందమూరి కుటుంబం

Next Story

Most Viewed