- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
58 ఏళ్ల వయసులో తండ్రి అయిన నటుడు.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ (Arbaaz Khan)గుడ్ న్యూస్ ప్రకటించాడు.

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ (Arbaaz Khan)గుడ్ న్యూస్ ప్రకటించాడు. ఆయన 58 ఏళ్ల వయసులో మరోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అర్బాజ్ భార్య షురా ఖాన్‌కు పండంటి ఆడబిడ్డ జన్మినట్లు వెల్లడించారు. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చేసిన సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక చాలా రోజుల తర్వాత వారి ఇంట్లో ఆడపిల్ల పుట్టడం విశేషం. దీంతో అర్బాజ్ ఇంట్లో సంబరాలు అంబరాన్ని తాకాయి.
కుటుంబం మొత్తం ఆనందంలో మునిగి తేలుతున్నారు. కాగా, షురా ఖాన్(Shura Khan), అర్బాజ్ ఖాన్ 2013లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అర్బాజ్‌కు రెండు పెళ్లి కావడం గమనార్హం. 1998లో మలైకాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే 18 ఏళ్ల అనోన్యంగా జీవించిన ఈ జంట మనస్పర్థలు తలెత్తడంతో 2017లో విడాకులు విడిపోయారు. దీంతో అర్బాజ్, మరో పెళ్లి చేసుకున్నాడు. ఇక పెళ్లైన ఏడాదికే ప్రెగ్నెంట్ అయినట్లు ప్రకటించగా.. పండంటి ఆడపిల్ల పుట్టింది.






