Anupam Kher : రవితేజకి క్షమాపణలు చెప్పిన నటుడు అనుపమ్ ఖేర్..

by Disha Web Desk 7 |
Anupam Kher : రవితేజకి క్షమాపణలు చెప్పిన నటుడు అనుపమ్ ఖేర్..
X

దిశ, సినిమా: మాస్ మహరాజా రవితేజ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ ఒకటి. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ దేశంలోనే అతిపెద్ద గజదొంగగా పేరుగాంచిన స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా రూపొందుతోంది. ఇందులో రవితేజ సరసన నుపుర్ సనన్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. గాయత్రీ భరద్వాజ్, అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జుస్సు సెంగుప్త, మురళీ శర్మ, హరీశ్ పేరడి, సుదేవ్ నాయర్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 20న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచింది మూవీ యూనిట్. ఇందులో భాగంగా ముంబైలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో రవితేజ హిందీలో మాట్లాడి అదరగొట్టాడు. ఈ క్రమంలో అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. రవితేజ గ్రేట్‌నెస్‌ని తెలిపాడు.

‘ఇతనే అసలైన రౌడీ రాథోడ్. ఇతనే అసలైన ‘కిక్’ హీరో. ఈ విషయం అందరికి తెలియాలి. 1988లో ఓ సారి రవితేజ నా స్టూడియోకి వచ్చాడు. అప్పుడు చిన్న పిల్లాడు. ఫొటోనో, ఆటోగ్రాఫో అడిగాడు నాకు ఇవ్వడం కుదర్లేదు. కానీ ఇన్నేళ్ల తర్వాత ఇలా ఆయన సినిమాలో నేను ఓ పాత్ర పోషిస్తున్నాను అంటే చాలా గ్రేట్. అప్పుడు జరిగినదానికి ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు అనుపమ్ ఖేర్. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ‘ది డెఫినేషన్ ఆఫ్ సక్సెస్’ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed