హార్ట్ ఎటాక్‌తో ఆసుపత్రిలో చేరిన నటుడు.. ఎమోషనల్ పోస్ట్ వైరల్.. ఆరోగ్య పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే?

by Mallepaka Hamsa |

సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే.

హార్ట్ ఎటాక్‌తో ఆసుపత్రిలో చేరిన నటుడు.. ఎమోషనల్ పోస్ట్ వైరల్.. ఆరోగ్య పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే?
X

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా, బాలీవుడ్ నటుడు ఆసిఫ్ ఖాన్(Asif Khan) హార్ట్ ఎటాక్‌తో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. చికిత్స పొందుతున్న ఆయన తన ఆరోగ్య పరిస్థితి గురించి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వివరించారు. ‘‘నేను అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాను. 36 గంటలుగా ఇక్కడే ఉన్నాను. హాస్పిటల్ పైకప్పు చూసుకుంటూ జీవితం ఎంత చిన్నదో గ్రహించాను. దేనిని తేలికగా తీసుకోకండి. ఒక్క క్షణంలో అన్ని మారిపోతాయి.

మీకు మీరు కృతజ్ఞతతో ఉండండి. జీవితంలో ఎవరు ముఖ్యమో వారితో ఆనందంగా ఉండండి. జీవితం ఒక వరం. ప్రస్తుతం కోలుకుంటున్నాను.. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మీ ముందుకు వస్తాను’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. కాగా, ఆసిఫ్ ఖాన్ 2011లో రెడీ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. పలు చిత్రాల్లో విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించాడు. ఇక ఇటీవల ‘ది భూత్ని’ మూవీతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఇష్క్, చాకలాస్, సెక్షన్ 108, నురానీ చెహ్రా వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు.

link

Next Story