ఆ మ్యాజిక్‌ను పాడు చేస్తే చర్యలు తప్పవంటూ ‘ఫౌజీ’ మూవీ టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్.. అసలేం జరిగిందంటే?

by Mallepaka Hamsa |

మా సినిమా సెట్స్ నుంచి లీకైన ఫోటోలను కొన్ని సోషల్ మీడియా ఖాతాలు సర్క్యులేట్ చేస్తున్నాయనే విషయం మా దృష్టికి వచ్చింది.

ఆ మ్యాజిక్‌ను పాడు  చేస్తే చర్యలు తప్పవంటూ  ‘ఫౌజీ’ మూవీ టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్.. అసలేం జరిగిందంటే?
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఫౌజీ’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంతో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి హీరో ప్రభాస్ లుక్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో చిత్ర యూనిట్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.సినిమా సెట్స్ నుంచి అనధికారికంగా ఫోటోలు బయటకు రావడంపై ‘ఫౌజీ’ మేకర్స్ తాజాగా ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. "మా సినిమా సెట్స్ నుంచి లీకైన ఫోటోలను కొన్ని సోషల్ మీడియా ఖాతాలు సర్క్యులేట్ చేస్తున్నాయనే విషయం మా దృష్టికి వచ్చింది. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారికి ఇదే మా చివరి హెచ్చరిక. అనధికారిక కంటెంట్‌ను షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం మరియు ఫిర్యాదు చేస్తాం" అని చిత్రబృందం స్పష్టం చేసింది.

ఇలాంటి లీకులు తమ కష్టాన్ని మరియు సినిమాపై ఉన్న ఉత్సుకతను దెబ్బతీస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై దర్శకుడు హను రాఘవపూడి కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. "మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక అద్భుతమైన సినిమాను అందించేందుకు మా టీమ్ రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. వెండితెరపై ఆ మ్యాజిక్‌ను మీరు చూసినప్పుడే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. దయచేసి లీక్స్‌తో ఆ మ్యాజిక్‌ను పాడు చేయకండి. సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు మాకు సహకరించండి" అని ఆయన అభిమానులను కోరారు. వెండితెరపై ఒక విజువల్ వండర్‌ను అందించబోతున్నామని, ప్రేక్షకుల నిరీక్షణకు తగ్గ ఫలితం ఉంటుందని చిత్ర యూనిట్ భరోసా ఇచ్చింది. కాబట్టి ఫ్యాన్స్ ఎవరూ లీకైన కంటెంట్‌ను షేర్ చేయవద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story