- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాక్షన్ షురూ.. ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ టీజర్ అప్డేట్‌తో అంచనాలను రెట్టింపు చేసిన మేకర్స్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య(Naga Shaurya) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య(Naga Shaurya) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. చాలా రోజులుగా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ప్రస్తుతం నాగశౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’(Bad Boy Karthik) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌ను రామ్ దేశిన(Ram Desina) తెరకెక్కిస్తుండగా.. ఇందులో విధి యాదవ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో సముద్రఖని, వీకే నరేష్, సాయికుమార్, గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీని శ్రీవైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు.
షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం వరుస అప్‌డేట్స్‌ను రిలీజ్ చేస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ టీజర్ సెప్టెంబర్ 6న 11:57గంటలకు రాబోతున్నట్లు వెల్లడించారు. ‘‘మాస్ మ్యాడ్‌నెస్.. యాక్షన్ ప్రారంభం కానుంది’’ అనే క్యాప్షన్ జత చేస్తూ.. నాగ శౌర్య రక్తంతో ఉన్న చేతులులో అంబులెన్స్‌లో కూర్చున్న పోస్టర్‌ను షేర్ చేసి అంచనాలను రెట్టింపు చేశారు.






